తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

By Rajesh Karampoori  |  First Published Jun 4, 2024, 10:38 AM IST

Tadikonda Assembly elections result 2024:  ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై వివాదం కొనసాగుతున్న వేళ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందులో ఒక్క నియోజకవర్గమే ఇది.  


Tadikonda Assembly elections result 2024:  ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడికొండ పేరు ఎక్కువగా వినిపించింది. ఈ ఎన్నికల్లో టిడిపికి గెలిచేంత బలం లేకున్నా అభ్యర్థిని పోటీలో నిలిపి విజయం సాధించింది. తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపికి ఓటు వేసినట్లు ఆరోపిస్తూ వారిని పార్టీనుండి సస్పెండ్ చేసారు. అంతేకాదు వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరింది అధికార పార్టీ.  తాజాగా వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసారు. ఇలా అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకరు.  దీంతో ఇక్కడి రాజకీయ రసవత్తరంగా మారింది. మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో వేచిచూడాలి. 

తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

Latest Videos

undefined

1. తాడికొండ
2. తుళ్లూరు
3. ఫిరంగిపురం 
4. మేడికొండూరు

తాడికొండ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :  

తాడికొండ వైసిపి అభ్యర్ధి :

ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ వీడటంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను వైసిపి బరిలో దించింది.  ది వైసిపి. 

తాడికొండ టిడిపి అభ్యర్థి :

టిడిపి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తాడికొండ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఈయన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో తనపై పోటీచేసిన ఉండవల్లి శ్రీదేవి వైసిపిని వీడి టిడిపిలో చేరడం కలిసివస్తుందని శ్రవణ్ భావిస్తున్నాడు. 

తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన తెనాలి శ్రావణ్ కుమార్ 109585 ఓట్లు పొంది YSRCPకి చెందిన సుచరిత మేకతోటిని ఓడించారు.

తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 :

గుంటూరు జిల్లాలో ఎస్సీలకు కేటాయింపబడిన ఈ తాడికొండ నియోజకవర్గంలో 2019 ఎన్నికల ప్రకారం 2,00,065 మంది ఓటర్లు వున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు ఇలా వున్నాయి. 

వైసిపి - వుండవల్లి శ్రీదేవి - 86,848 ఓట్లు (48 శాతం) గెలుపు 

టిడిపి - తెనాలి శ్రవణ్ కుమార్ - 82,415 ఓట్లు (46 శాతం) ఓటమి 

తాడికొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 : 

ఈ ఎన్నికల్లో మొత్తం 1,59,473 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు... అంటే 89 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

టిడిపి - తెనాలి శ్రవణ్ కుమార్ - 80,847 ‌(50 శాతం) గెలుపు 

వైసిపి - కథేరా హేనీ క్రిస్టినా - 73,305 ఓట్లు (45 శాతం) ఓటమి 

click me!