వైఎస్ జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ .. రాజకీయ, కార్పోరేట్ వర్గాల్లో ప్రాధాన్యత

Siva Kodati |  
Published : Sep 28, 2023, 08:02 PM ISTUpdated : Sep 28, 2023, 08:04 PM IST
వైఎస్ జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ .. రాజకీయ, కార్పోరేట్ వర్గాల్లో ప్రాధాన్యత

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో అదానీ పలు కీలక విషయాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అదానీ .. విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో అదానీ పలు కీలక విషయాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

కాగా.. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు విశాఖలో మెగా డేటా హబ్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అలాగే ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అదానీ గ్రూప్ ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు హామీలిచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్‌తో పెట్టుబడులపై చర్చించేందుకు అదానీ హాజరైనట్లుగా కథనాలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Director Ajay Bhupathi Speech: రాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ: డైరెక్టర్ అజయ్ భూపతి | Asianet Telugu
Minister Gottipati Ravi Kumar Speech: మంత్రి నారాయణపై గొట్టిపాటి ప్రశంసలు | Asianet News Telugu