తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా.. సంచలన కామెంట్స్

Published : May 31, 2022, 01:16 PM ISTUpdated : May 31, 2022, 01:39 PM IST
తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా.. సంచలన కామెంట్స్

సారాంశం

తెలుగుదేశం పార్టీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. టీడీపీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి చెప్పారు. 

తెలుగుదేశం పార్టీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. టీడీపీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. ఇక, ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడులో తనకు అవమానం జరిగిందని దివ్యవాణి ఆరోపించారు. టీడీపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న దివ్యవాణి.. పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

దివ్యవాణి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ‌లో యాక్టివ్‌గా ఉంటున్న దివ్యవాణి.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. టీడీపీపై వైసీపీ మహిళా నేతలు చేసే వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడి చేస్తుంటారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా ఆమె నివాళులర్పించారు. ఆ సమయంలో కూడా టీడీపీ గురించి ఆమె గొప్పగా మాట్లాడారు. 

అయితే మహానాడులో తనకు అవమానం జరిగిందని ఆమె ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘నేను కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పాలనుకుంటున్నాను. అంబికా కృష్ణగారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు నాయుడును విజన్ ఉన్న నాయకుడుగా భావించాను. నేను ఏసుక్రీస్తుకు నమ్ముతాను. నేను అబద్ధాలు చెప్పను. పార్టీలో సరైన మార్గదర్శకత్వం లేదు. ఒక క‌ళాకారుడుపెట్టిన పార్టీలో నాలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం న‌న్ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోంది. ఈ విషయం నాకు ప్రాక్టికల్‌గా అర్థమవుతోంది. మురళీమోహన్‌ గారు తప్ప మరే ఆర్టిస్టు టీడీపీలో నిలదొక్కుకోలేకపోయారు. 

నాకు అధికార ప్రతినిధి అనే ట్యాగ్ ఇచ్చారు.. కానీ నాకు ఎలాంటి అధికారం లేదు.. మహానాడులో మాట్లాడనివ్వలేదు.  కొంతమంది పార్టీ వాళ్ళ నుంచి ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నందుకు ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. ఈ పార్టీ కోసమే నేను రాత్రిపూట నా కారులో ప్రయాణిస్తున్నాను. నాకు ఏదైనా జరిగితే ఏమవుతుంది? నా మృతదేహాన్ని ఈ పార్టీ ఓట్లు అడుక్కోవడానికి ఉపయోగిస్తుందని నేను అనుకుంటున్నాను, అంతే’’ అని ఆ ఇంటర్వ్యూలో దివ్యవాణి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం