కువైట్ వెళ్లిన తిరుపతి మహిళకు వేధింపులు.. గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారని సెల్ఫీ వీడియో..

Published : May 31, 2022, 01:05 PM ISTUpdated : May 31, 2022, 01:44 PM IST
కువైట్ వెళ్లిన తిరుపతి మహిళకు వేధింపులు.. గదిలో బంధించి  చిత్రహింసలు పెడుతున్నారని సెల్ఫీ వీడియో..

సారాంశం

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తిరుపతికి చెందిన ఓ మహిళకు అక్కడ వేధింపులు ఎదురయ్యాయి. తనను ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారని బాధిత మహిళ పేర్కొన్నారు.

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తిరుపతికి చెందిన ఓ మహిళకు అక్కడ వేధింపులు ఎదురయ్యాయి. తనను ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారని బాధిత మహిళ పేర్కొన్నారు. నాలుగు రోజులుగా ఆహారం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకురావాలని వేడుకున్నారు. ఏజెంట్ చెంగల్ రాజు, అతడి మిత్రుడు బావాజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బాధిత మహిళ సెల్పీ వీడియోను రికార్డు చేసి కుటుంబ సభ్యులుకు పంపించారు. 

తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలాని చెందిన శ్రావణి అనే మహిళ గత నెలలో కువైట్‌కు వెళ్లారు. చెంగల్‌ రాజు అనే ఏజెంట్‌ ఆమె గల్ఫ్‌ చేరేందుకు సహకరించాడు. అక్కడికెళ్లాక శ్రావణిని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. అక్కడ బాగోలేకపోవడంతో ఇల్లు మార్చమని ఆమె కోరింది. ఏజెంట్‌ చెంగల్‌రాజు, అతడి మిత్రుడు బావాజీ ఇదే అదునుగా ఆమెను అక్కడ ఓ గదిలో బంధించారు. అక్కడ చెంగల్ రాజు, బావాజీలు  లైంగిక కోరిక తీర్చాలని తనను శారీరకంగా, మానసికంగా బాధితురాలు తెలిపారు. 

 

నాలుగు రోజులుగా తిండి కూడా పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తనను భారత్‌కు రప్పించేలా చూడాలని ఆమె వేడుకున్నారు. ఇక, ఇందుకు సంబంధించి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రావణి భర్త తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం