విడాకులు ఇవ్వకుండా వేధించినందుకే హత్య చేశా: పద్మ హత్యపై టెక్కీ వేణుగోపాల్ సంచలనం

By narsimha lode  |  First Published May 31, 2022, 1:00 PM IST

విడాకులు ఇవ్వకుండా తనను వేధింపులకు గురి చేయడంతోనే తాను తన భార్య పద్మను హత్య చేసినట్టుగా  టెక్కీ వేణుగోపాల్ చెప్పారు. తనను జాబ్ చేసుకోకుండా ఇబ్బందులు పెట్టడంతోనే తాను హత్య చేసినట్టుగా వేణుగోపాల్ తెలిపారు.
 


తిరుపతి: విడాకులు ఇవ్వకుండా తనను వేధింపులకు గురి చేయడంతోనే తాను తన భార్య పద్మను హత్య చేయాల్సి వచ్చిందని టెక్కీ వేణుగోపాల్ చెప్పారు. ఐదు మాసాల క్రితం Venugopal తన భార్య Padma ను హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు వేణుగోపాల్ ఈ విషయాన్ని ఒప్పుకొన్నాడు. సూట్ కేసులో Dead body ని పెట్టి రేణిగుంటకు సమీపంలోని వెంకటాపురం  వద్ద గల చేపల చెరువులో డెడ్ బాడీని పారేశాడు.

ఇవాళ ఉదయం  ఈ డెడ్ బాడీని వెలికి తీసే సమయంలో  నిందితుడిని చెరువు వద్దకు పోలీసులు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా నిందితుడు వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.  తన భార్య తనతో కాపురం చేయడానికి రానని తేల్చి చెప్పిందన్నారు.

Latest Videos

undefined

also read:సూట్‌కేసులో భార్య డెడ్‌బాడీ పెట్టి చెరువులో వేసిన టెక్కీ: ఐదు నెలల తర్వాత కేసును చేధించిన పోలీసులు

అయితే Divorce తీసుకొంటానని తాను కూడా పద్మ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వేణుగోపాల్ చెప్పారు.తనకు వివాహం సమయంలో ఇచ్చిన వరకట్నం డబ్బులు కూడా ఇచ్చేస్తానని పద్మకు చెప్పినట్టుగా నిందితుడు వేణుగోపాల్ మీడియాకు వివరించారు. అయితే పద్మ తమ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలని భావించిందన్నారు. చట్టం కూడా ఆమెకు అనుకూలంగా సహాయం చేస్తుందని కూడా టార్చర్ పెట్టిందన్నారు. పలు చోట్ల మహిళ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిందన్నారు. టార్చర్ పెట్టినందునే చంపాల్సి వచ్చిందని వేణుగోపాల్ చెప్పారు.

చిత్ర హింసలు పెట్టారు: వేణుగోపాల్ పై  పద్మ కుటుంబ సభ్యలు

పెళ్లైన తర్వాత తన సోదరి పద్మను వేనుగోపాల్ చిత్ర హింసలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన  సోదరిని నగ్నంగా  చేసి కొట్టేవాడన్నారు. అంతేకాదు బాత్ రూమ్ లో కూడా బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టుగా పద్మ సోదరి మీడియాకు వివరించారు. పెళ్లైన మూడో రోజునే తన సోదరి ఒంటి మీద వేణుగోపాల్ వాతలు పెట్టాడని పద్మ సోదరుడు ఆరోపించారు. తనకు తెలియకుండా తన సోదరి అత్తింటికి వెళ్లిందన్నారు. అత్తింటికి వెళ్లిన రోజునే ఆమెను హత్య చేశారని ఆయన ఆరోపించారు. 

జనవరిలోనే పద్మ హత్య: ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి

పెళ్లైన తర్వాత వేణుగోపాల్, పద్మల మధ్య మనస్పర్ధలు రావడంతో  ఎవరి ఇంటి వద్ద వారున్నారన్నారని తిరుపతి ఈస్ట్ సీఐ Siva Prasad Reddy చెప్పారు. ఇరువురి మధ్య రాజీ చేసేందుకు గాను ప్రయత్నాలు చేశారు.  కానీ రాజీ కుదరలేదన్నారు. పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన పద్మను  వేనుగోపాల్ కొట్టి చంపాడని సీఐ శివప్రసాద్ రెడ్డి చెప్పారు.  ఇంట్లోనే కర్రతో పద్మ తలపై కొట్టడంతో ఆమె గాయపడి మరణించిందని సీఐ చెప్పారు. 

click me!