టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు టైం కలిసిరాలేదని చెప్పుకొచ్చారు. 

Actor Suman's sensational comments on TDP chief Chandrababu Naidu's arrest  - bsb

హైదరాబాద్ : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అవడంపై సినీ నటుడు సుమన్ స్పందించారు. ఆయన అరెస్టు అవ్వడం పాలిటిక్స్ లో ఒక గుణపాఠం అన్నారు. హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు అరెస్ట్, బెయిల్, విడుదల అంశాల గురించి మాట్లాడుతూ…‘దేనికైనా టైం కలిసి రావాలి. చంద్రబాబు పుట్టిన తేదీ కరెక్ట్ గా చూసి జ్యోతిష్యం చెప్పే జ్యోతిష్కుడు ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలుస్తుంది. టైం బాగున్నప్పుడు లోకల్ కోర్టులో కూడా మనకు అన్ని అనుకూలంగానే జరిగిపోతుంటాయి. అది బాగా లేనప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి. చంద్రబాబుకు టైం కలిసి వచ్చి.. అన్ని అనుకూలంగా మారేవరకు ఆయన జైలులోనే ఉంటారు’ అన్నారు.

Latest Videos

మనోహరాబాద్‌లో చెరువులో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాల వెలికితీత, బాలుడి కోసం గాలింపు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వల్లనే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాడని దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ, అందులో నిజం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే చర్య తీసుకుంటారు. అలాగే అరెస్టు చేసి ఉంటారు. సమయం మనకు ప్రతికూలంగా ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి’ అన్నారు. 

ఇదిలా ఉండగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్  డెవలప్మెంట్ స్కాం  కేసులో  అరెస్ట్ అయిన తర్వాత  పరిణామాల్లో భాగంగా… టిడిపితో  జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ పొత్తు  మీద  టిడిపి,  జనసేన  కేడర్లలో  గందరగోళం నెలకొంది.  జనసేన నేత నాగబాబు ముందే తాజాగా ఆ పార్టీ కార్యకర్తలు  తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైనా కూడా నాగబాబు టిడిపి తో కలిసి ప్రయాణం చేయడం తప్పదంటూ కార్యకర్తలకు సూచించారు.

కాగా మరోవైపు జనసేన నేతలతో  మాజీ ముఖ్యమంత్రి, టిడిపి  అధినేత చంద్రబాబు నాయుడు  కోడలు,  నారా లోకేష్ సతీమణి  నారా బ్రాహ్మిణి  ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు నారా బ్రాహ్మణితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలు రాజమహేంద్రవరం విద్యానగర్లో ఉన్న లోకేష్ క్యాంపు దగ్గర సమావేశమయ్యారు.

 ఈ సమావేశానికి హాజరైన నారా బ్రాహ్మణి.. జనసేన నేతలను చూసి  పవన్ కళ్యాణ్ ఎక్కడ?  అని ప్రశ్నించారు. దీంతో జనసేన నేతలు అయోమయానికి గురయ్యారు. కంగు తిన్నారు. ఇలాంటి మీటింగ్లకు కూడా తమ అధినేతను అడగడం చూసి ఆశ్చర్యంతో గుసగుసలు పెట్టుకున్నారు. దీంతో  ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక… ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారని సమాధానం చెప్పారు.  ఆ సమాధానం విన్న నారా బ్రాహ్మణి అవునా అన్నట్లుగా తల ఊపారని సమాచారం. 

టిడిపి,  జనసేన కలిసి చేసే ఉమ్మడి పోరాటానికి టిడిపి తమకు మద్దతు ఇస్తేనే ముందుకు సాగుతామని ఆ పార్టీ నేతలు నారా బ్రాహ్మణికి స్పష్టం చేశారు. ఈ పోరాటం కోసం నిధులు సమకూర్చాలని జనసేన నేతలు ఆమెను కోరినట్లుగా తెలుస్తోంది.  దీనికి.. బ్రాహ్మణి మాత్రం ‘ నిధుల విషయం తర్వాత మాట్లాడదాం..  ఉమ్మడి పోరు ప్రారంభిద్దాం’  అని చెప్పినట్లు సమాచారం.  దీంతో చేసేదేం లేక జనసేన నేతలు వెనక్కి తిరిగినట్లుగా తెలుస్తోంది. 

vuukle one pixel image
click me!