ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం.. వివరాలు ఇవే..

Published : Sep 25, 2023, 02:32 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం.. వివరాలు ఇవే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఈరోజు 4 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఈరోజు 4 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అందులో ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్‌ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సవరణ బిల్లు-2023, గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్ల-2023. ఏపీ వస్తు సేవల పన్నుల సవరణ బిల్లు-2023 లు ఉన్నాయి. 

ఇక, ఈరోజు ఉదయం 9 గంటలకు మూడో రోజు సమావేశాలు ప్రారంభంగా కాగానే శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం సభలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింద‌ని విమ‌ర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం వైఎస్ జగన్‌ సిద్ధాంతమ‌ని చెప్పారు. ఆ దిశ‌గా వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద‌పీట వేశార‌ని, రైతు భ‌రోసా పేరుతో అన్న‌దాత‌ల‌ను వ్య‌వ‌సాయంలో ప్రోత్స‌హిస్తున్నార‌ని, కోవిడ్‌ సంక్షోభంలోనూ మా ప్రభుత్వం రైతులను ఆదుకుంద‌న్నారు.  రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంద‌ని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని  అన్నారు. 

ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు మాట్లాడుతూ..సీఎం జగన్ పేద‌వారికి అండ‌గా నిలుస్తున్నార‌ని అన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను సీఎం జగన్‌ పరిష్కరించారని చెప్పారు. హామీలు ఇవ్వడమే కాదు దానిని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని అన్నారు. అందదికీ సమానమైన స్థాయి, న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా చేసింది సీఎం జగనేనని అన్నారు. సీఎం జగన్‌ కార్మికులు, కర్షకులను ప్రేమిస్తారని చెప్పారు. భూమాతను కొందరికే సొంతం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపణలు గుప్పించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?