బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Jan 02, 2019, 08:21 PM IST
బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

 వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే నాకేంటీ, చేయకపోతే నాకేంటీ అని సినీ నటుడు శివాజీ చెప్పారు

అమరావతి: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే నాకేంటీ, చేయకపోతే నాకేంటీ అని సినీ నటుడు శివాజీ చెప్పారు.  పొత్తులనేవి చంద్రబాబునాయుడు ఇష్టమని ఆయన చెప్పారు. అయితే తాను ఎవరికీ కూడ మద్దతివ్వబోనని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నాడుఆయన అమరావతిలో  ఓ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడారు.  ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే వార్తలపై ఆయన స్పందించారు. రాష్ట్ర హక్కుల విషయంలో తాను రాజీపడబోనని చెప్పారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్,  ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో ఎన్టీఆర్ బయోపిక్‌కే  ఎక్కువ గుర్తింపు ఉందన్నారు. లక్ష్మీపార్వతికి ఏం చరిత్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైస్రాయ్ ఘటనకు లక్ష్మీపార్వతి మనుషులే కారణమన్నారు. ఆ సమయంలో  తాను  వైస్రాయ్ ఘటనకు సాక్షిగా ఉన్నానని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?