సినీనటుడు పృథ్విరాజ్ కు జగన్ బంపర్ ఆఫర్

Published : Feb 15, 2019, 07:57 PM IST
సినీనటుడు పృథ్విరాజ్ కు జగన్ బంపర్ ఆఫర్

సారాంశం

రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అంతేకాదు టీవీ డిబెట్స్ లో కూడా పాల్గొంటూ ఇతర పార్టీలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. పృథ్విరాజ్ సేవలను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. 

హైద‌రాబాద్‌: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కమెడియన్ పృథ్విరాజ్ కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. గత కొంతకాలంగా పృథ్విరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 

రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అంతేకాదు టీవీ డిబెట్స్ లో కూడా పాల్గొంటూ ఇతర పార్టీలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. పృథ్విరాజ్ సేవలను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. 

అందుకు సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పృథ్విరాజ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావించారు. 

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్వహించే పలు కార్యక్రమాలకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పృథ్విరాజ్ పాల్గొన్నారు. అనంతరం ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలోనూ పాల్గొన్నారు. అలాగే ఢిల్లీలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో కూడా పాల్గొన్నారు. 

ఇకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి పృథ్విరాజ్ తోపాటు హీరో కృష్ణుడు, అలనాటి హీరో భానుచందర్, ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం