ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

Siva Kodati |  
Published : Jan 12, 2020, 07:36 PM ISTUpdated : Jan 12, 2020, 09:46 PM IST
ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

సారాంశం

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి .. పృధ్వీరాజ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. హైకమాండ్ ఆదేశాలతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పృథ్వీ ప్రకటించారు. 

ఛానెల్ ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్  అసభ్యంగా మాట్లాడినట్టుగా  సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. ఈ పరిణామాలపై పృథ్వీరాజ్  ఆదివారం నాడు మధ్యాహ్నం ఓ వీడియోను మీడియాకు పంపారు.

చానెల్ ఉద్యోగుల పట్ల తాను ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని చెప్పారు. తాను అందరికి అన్నగానే ఉన్నానని చెప్పారు. తన ఆడియోను మార్ఫింగ్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు.

అన్యమత ప్రచారం గురించి కూడ తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనల విషయంలో పృథ్వీ చేసిన ఆరోపణలపై కూడ ఆయన వివరణ ఇచ్చారు.

రాజధాని  రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తాను అనలేదన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు. తన మాటలకు రైతులు బాధపడినందుకుగాను  తనను క్షమాపణలు చెబుతున్నట్టుగా పృథ్వీ ఆ వీడియోలో వివరించారు.

ఉద్యోగినిని అసభ్యంగా మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణ తనకు తలవొంపులు తెచ్చేవిధంగా ఉందన్నారు. తాను పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ తెలిపారు.

విజిలెన్స్ విచారణలో  అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పోసాని కృష్ణమురళి మాదిరిగానే తాను కూడ ముక్కుసూటిగా మాట్లాడుతానని చెప్పారు.పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా తాను ఏనాడూ వ్యవహరించలేదని తెలిపారు

PREV
click me!

Recommended Stories

Annadata Sukhibhava-PM Kisan Funds | రైతులకు ఎగిరి గంతేసే వార్త స్పాట్ లో నే అకౌంట్ లోకి డబ్బులు
Yogandhra 2026: సీఎం చంద్రబాబుని ఆకట్టుకున్న ధూమపానం హానికరం వినూత్న ప్రమోషన్| Asianet News Telugu