చూపించు, నీ కాళ్లు మొక్కుతా: పవన్ కల్యాణ్ పై పోసాని ఫైర్

Published : Mar 23, 2019, 05:17 PM IST
చూపించు, నీ కాళ్లు మొక్కుతా:  పవన్ కల్యాణ్ పై పోసాని ఫైర్

సారాంశం

అసలు కేసీఆర్ ను పొగిడింది ఎవరు అని పవన్ ను నిలదీశారు. మెున్నటి వరకు కేసీఆర్ ను పొగిడి ఇప్పుడు వైఎస్ జగన్ ను తిడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రావాళ్ల భూములను కేసీఆర్ లాక్కున్నట్లు చూపిస్తే తాను పవన్ కళ్యాణ్ కి పాదావభివందనం చేస్తానని సవాల్ విసిరారు. ఎవరిని బెదిరించి వైసీపీలోకి పంపించారో కూడా స్పష్టం చెయ్యగలవా అంటూ నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోసాని ఆరోపించారు. 

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు, సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కేసీఆర్ కొడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 

ఎవరిని కొట్టారో, ఒక్కరినైనా చూపించగలవా అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అంటూ ప్రశ్నించారు. ఎవరినైనా కేసీఆర్ కొట్టారు అని నిరూపించగలవా అంటూ పోసాని ప్రశ్నించారు. 

అసలు కేసీఆర్ ను పొగిడింది ఎవరు అని పవన్ ను నిలదీశారు. మెున్నటి వరకు కేసీఆర్ ను పొగిడి ఇప్పుడు వైఎస్ జగన్ ను తిడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రావాళ్ల భూములను కేసీఆర్ లాక్కున్నట్లు చూపిస్తే తాను పవన్ కళ్యాణ్ కి పాదావభివందనం చేస్తానని సవాల్ విసిరారు. 

ఎవరిని బెదిరించి వైసీపీలోకి పంపించారో కూడా స్పష్టం చెయ్యగలవా అంటూ నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోసాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వలలో పడ్డారని పోసాని కృష్ణమురళీ ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu