ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంచు మనోజ్ సవాల్... కుటుంబరావుపై ఫైర్

By Arun Kumar PFirst Published Mar 23, 2019, 1:11 PM IST
Highlights

తమ కాలేజిలో చదివే  విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రాయింబర్స్ మెంట్ అందించడం లేదని సీనీ  నటులు, శ్రీవిద్యా నికేతన్ కళాశాలల అధినేత మోహన్ బాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చెల్లించని బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన శుక్రవారం తిరుపతి-మదనపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ధర్నాలో సినీ నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు. 

తమ కాలేజిలో చదివే  విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రాయింబర్స్ మెంట్ అందించడం లేదని సీనీ  నటులు, శ్రీవిద్యా నికేతన్ కళాశాలల అధినేత మోహన్ బాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చెల్లించని బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన శుక్రవారం తిరుపతి-మదనపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ధర్నాలో సినీ నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు. 

అయితే ఈ ధర్నాపై టీడీపీనేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు తీవ్ర విమర్శలు చేశారు. మోహన్ బాబు విద్యాసంస్థల పేరిట వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలా తన తండ్రిపై అనుచితంగా మాట్లాడిన కుటుంబరావుపై మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. తమ కుటుంబం అబద్దాలాడుతున్నట్లు నిరూపిస్తే మొత్తం ఫీజు రీయిబర్స్ మెంట్ బకాయిలను వదులుకోడానికి సిద్దంగా వున్నట్లు మనోజ్ సవాల్ విసిరారు. 

శుక్రవారం మంచు మనోజ్ ఓ పత్రికా ప్రటకనతో పాటు ప్రభుత్వం శ్రీవిద్యానికేతన్ కళాశాలలకు అందించిన ఫీజ్ రీయింబర్స్ మెంటుకు సంబంధించిన పత్రాలను విడుదల చేశారు.  పెద్ద మనిసి కుటుంబ రావు విద్యార్థుల కుటుంబాలన తరపున కాకుండా చంద్రబాబు కుటుంబం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని మనోజ్ అన్నారు. తన తండ్రి మాటలను  అబద్దాలంటున్న ఆయన  కొన్ని విషయాలను గమనించాలంటూ సూచించారు. 

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఐఎఎస్ అధికారి రావత్ ను పలుమార్లు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల కోసం కలిసినట్లు తెలిపారు. ఇలా చివరగా  ఈ నెల  రెండవ తేధీన కూడా చివరగా ఆయనతో మాట్లాడినా పరిష్కారం కాకపోవడంతో నిరసనకు దిగినట్లు మనోజ్ వెల్లడించారు. 

తమ చెబుతున్న లెక్కలన్నీ తప్పని అంటున్న కుటుంబరావు... ఒక్క వేయి రూపాయలు తప్పని నిరూపించినా మొత్తం  రీయింబర్స్ మెంట్ సొమ్ము తమకు ఇవ్వాల్సిన అవసరం లేదని తన తండ్రి మోహన్ బాబు చెప్పమన్నారని  మనోజ్ తెలిపారు. 
 
తమ విద్యాసంస్థల ద్వారా 25 శాతం మందికి ఉచిత విద్య అందిస్తున్నామని... కావాలంటే అందుుకు సంబంధిచిన పత్రాలను కూడా సమర్పిస్తామని మనోజ్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా ఈ ఉచిత విద్యను అమలు చేస్తున్నామన్నారు. కళ్లు తెరిచి చూస్తూ కుటుంబ రావు వంటి వారికి ఇలాంటివి కనిపిస్తాయని మనోజ్ తెలిపారు. ఈ 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్  కూడా ప్రభుత్వ డబ్బులతో కాకుండా మా నాన్న నటుడిగా సంపాదించిన డబ్బులతో చేస్తున్నారన్నారు. తమ కుటుంబం నుండి ఏ ఒక్కరమూ పార్టీ టికెట్ కాదు కనీసం సినిమా టికెట్ కూడా అడగలేమని మనోజ్ స్పష్టం చేశారు. 


 

    

click me!