వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన నటుడు పోసాని

Published : Jan 13, 2019, 11:21 AM IST
వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన నటుడు పోసాని

సారాంశం

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యదల్చుకోలేదన్నారు. 

హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యదల్చుకోలేదన్నారు. 

ప్రజలకు సేవ చెయ్యాలన్న కోరిక ఉందని అయితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందండం అదంతా నావల్ల కాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సేవ చెయ్యాలన్నదే తన అభిమతమన్నారు. తనకు పదవులు అవసరం లేదన్నారు. తాను ఏ పార్టీని ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని ఏనాడు అడగ లేదన్నారు. 

తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు. తాను కోరుకునేది ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాలనని చెప్పుకొచ్చారు. గతంతో తాను ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించానని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించానని ఇప్పుడు వైఎస్ జగన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన పోసాని కృష్ణ మురళీ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

ఇటీవల కాలంలో మళ్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టి అని చూడకుంటా ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో ఆయన్ను కలిశారు. జగన్ ను అభినందించారు. అయితే వైసీపీలో మాత్రం చేరలేదు.  

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు