Janasena: ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు, వైసీపీ ఫైర్.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మరోసారి వేస్తారా?

By Mahesh K  |  First Published Dec 16, 2023, 5:44 PM IST

జనసేన నేత నాగబాబు ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న నాగబాబు మళ్లీ ఏపీలో ఎలా ఓటు వేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఓట్లపై రాజకీయం జరిగింది. ఇందుకు భిన్నమైన కోణం ఒకటి బయటికి వచ్చింది. సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఏపీలో దరఖాస్తు చేసుకున్నారు. తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరంలో ఆయన ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతున్నది. వైసీపీ శ్రేణులు జనసేనపై విమర్శలు సంధిస్తున్నాయి.

ఓటు హక్కు ఒకే చోట ఉంటుంది. నాగబాబుకు కూడా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. అయితే, తెలంగాణలో లేదంటే.. ఏపీలో ఈ హక్కు ఉండాలి. రెండు చోట్ల ఉండే అవకాశం లేదు. అందుకే ఓటు మార్చుకున్నప్పుడు కొత్త చోట అవకాశం కల్పిస్తూ.. గతంలో ఉన్న చోట ఆ హక్కును తొలగిస్తారు. నాగబాబు ఏపీలో ఓటు హక్కుకు అవకాశం చేయగానే.. బూత్ లెవల్ ఆఫీసర్ విచారణ చేశారు. నాగబాబు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. నాగబాబు తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.

Latest Videos

Also Read: TS Assembly: అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. వాడిగా కామెంట్లు

నాగబాబుపై వైసీపీ ఆగ్రహిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు, ఆయన కుటుంబం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌లో నాగబాబు, కొణిదెల పద్మజ, వరుణ్ తేజ్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది. తెలంగాణలో ఓటు వినియోగించుకున్న నాగబాబు.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఓటు వేస్తారని ప్రశ్నిస్తున్నది.

click me!