షట్టర్ వేసి అత్యాచారయత్నం: ప్రతిఘటనతో మహిళ హత్య

By AN TeluguFirst Published Oct 1, 2020, 11:39 AM IST
Highlights

అనంతపురం జిల్లా ముదిగుబ్బలో కలకలం రేపిన కల్వర్టు కింద మహిళ హత్య మిస్టరీ వీడింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ధర్మవరంలోని చీరల దుకాణం యజమాని నిందితుడిగా తేలాడు. హత్యకు సహకరించిన నిందితుడి భార్య, స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే...

అనంతపురం జిల్లా ముదిగుబ్బలో కలకలం రేపిన కల్వర్టు కింద మహిళ హత్య మిస్టరీ వీడింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ధర్మవరంలోని చీరల దుకాణం యజమాని నిందితుడిగా తేలాడు. హత్యకు సహకరించిన నిందితుడి భార్య, స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే...

జూలై ఐదో తేదీన దొరిగిల్లుకు వెళ్లే దారిలోని కల్వర్టు కింద కాలిపోయిన మహిళ మృతదేహం ఉందన్న సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మీడియా ద్వారా ఈ విషయం తెలిసిన ధర్మవరానికి చెందిన జగన్నాథ్‌రెడ్డి ఆ శవం కూతురు కల్పనారెడ్డిదని పోలీసులకు తెలిపారడు.

ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. అయితే మూడు నెలల తరువాత నిందితుడు చింతల రాయుడు, భార్య హేమలత, అతని స్నేహితుడు జగదీష్‌ ముదిగుబ్బ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం లొంగిపోయారు. బుధవారం వీరిని అరెస్ట్‌ చూపారు. 

వివరాల్లోకి వెడితే.. ధర్మవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్‌ కల్పనారెడ్డి భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. చీరలకోసం నిత్యం చింతలరాయుడు నడిపే షాపుకు వస్తుంది. అతని దగ్గర చీటీలు కూడా వేసేది. ఈ క్రమంలో కల్పన ఒంటరి మహిళ అని గ్రహించాడు చింతలరాయుడు. ఆమెపై కన్నేశాడు. 

లాక్‌డౌన్‌ టైం జూన్‌ 29న మధ్యాహ్నం కల్పనారెడ్డి షాప్‌కు వచ్చింది. ఆ సమయంలో చింతలరాయుడు తప్ప ఎవ్వరూ లేరు.  షాప్‌ మూసే టైం అయిందంటూ కల్పనారెడ్డిని  లోపలే ఉంచి షట్టర్‌ వేశాడు. తర్వాత మంచి చీరలు చూపిస్తానని లోపలి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె దీనికి ప్రతిఘటించి, తన వారితో చెప్పి అంతు చూస్తానని బెదిరించింది. దీంతో భయపడ్డ చింతలరాయుడు వెంటనే ఆమె వేసుకున్న స్కార్ఫ్ ను ముఖానికి గట్టిగా చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. 

తెల్లవారి తన భార్యకు, స్నేహితుడు జగదీష్‌ కు జరిగిన విషయం చెప్పాడు. మృతదేహాన్ని అట్టతో ప్యాకింగ్‌ చేసి ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ఘాట్‌లో ఉన్న కల్వర్ట్‌ కింద పడేసి వెళ్లిపోయారు. తరువాత శవాన్ని ఎవరైనా గుర్తు పడితే దొరికిపోతామని భయపడి జూలై ఒకటో తేదీన మళ్లీ కల్వర్టు వద్దకు వెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టారు. 

అయితే ఈ హత్య విషయం అదే నెల ఐదో తేదీన వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తు వేగవంతమవడంతో నిందితులు  ముగ్గురూ సెప్టెంబర్‌ 29న పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

click me!