కర్నూల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఏసీబీ దాడులు: రూ. 15 లక్షలతో పట్టుబడ్డ ఎస్ఈ సురేంద్ర

By narsimha lode  |  First Published Jun 30, 2022, 1:01 PM IST

కర్నూల్ మున్సిఫల్ కార్పోరేషన్ లో గురువారం నాడు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఈ సురేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఎస్ఈ సురేంద్రను ప్రశ్నిస్తున్నారు.


కర్నూల్: Kurnool  మున్సిపల్ కార్పోరేషన్ లో గురువారం నాడు ACB అధికారులు Raids చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఈ Surendra ఏసీబీ అధికారులకు చిక్కారు.   ఎస్ఈ సురేంద్రను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అమృత్ స్కీం రూ. 1.52 కోట్ల బిల్లు మంజూరు చేసేందుకు ఎస్ఈ సురేంద్ర లంచం డిమాండ్ చేసినట్టుగా  కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి  ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్ పట్టించాడు.  కాంట్రాక్టర్ నుండి రూ. 15 లక్షలు తీసుకుంటున్న సమయంలో  ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest Videos

 మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో పలువురు అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులతో పాటు  లంచం  తీసుకొంటూ పలువురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని  ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను ఈ ఏడాది జూన్ 7న  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  రూ. 70 వేలు అంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

ఘట్ కేసర్ మండలంలోని అవుషాపూర్  గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన రెండు ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ సీతారాం లంచం డిమాండ్ చేశాడు. సుదర్శన్ అనే వ్యక్తి నుండి సీతారాం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.సీతారాంతో పాటు కిషోర్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని  అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నగరంలోని శంషాబాద్ లో  సంగారెడ్డి మండల  పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఈ ఏడాది మే 12న  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డికి భారీగా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

సురేందర్ రెడ్డిపై ఉన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డి ఇంట్లో సుమారు కోటి రూపాయాల నగదును కూడా డబ్బులు సీజ్ చేశారు. సురేందర్ రెడ్డి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. కోటి రూపాయాల విలువైన విల్లా, రూ. 43.80 లక్షల ఓపెన్ ప్లాట్, రూ. 8.11 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 129.2 తులాల గోల్డ్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారని సమాచారం. శంషాబాద్ లో పంచాయితీ అధికారిగా పనిచేసిన సురేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టుగా పలుఆరోపణలున్నాయి. 

ఎంపీవో సురేందర్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులున్నట్టుగా తమకు సమాచారం వచ్చిందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. హైద్రాబాద్ అల్వాల్ నివాసంలో రూ. 2.31 కోట్లు గుర్తించామన్నారు. సురేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన ఆస్తుల విలువ  రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని మే 2న ఇద్దరు  అధికారులపై ఏసీబీ  కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ తహసీల్దార్ తో పాటు సూర్యాపేట జిల్లాలోని పంచాయితీరాజ్ డీఈఈ కరుణసాగర్  ఇళ్లలో  ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.  

also read:సంచలనం సృష్టించిన కీసర ఏసీబీ కేసు: మూడో నిందితుడు అనుమానాస్పద మృతి

పంచాయితీరాజ్ డీఈఈ కరుణసాగర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  విల్లాలు, ప్లాట్లు, వావానాలు, ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కరుణాసాగర్ ఇంట్లో రూ. 25 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్పారు.

click me!