కడప వాణిజ్య శాఖలో అవినీతి తిమింగలం: రూ.10 కోట్ల అక్రమాస్తులు

By Siva KodatiFirst Published May 8, 2019, 12:52 PM IST
Highlights

కడప వాణిజ్య శాఖలో అవినీతి తిమంగలాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

కడప వాణిజ్య శాఖలో అవినీతి తిమంగలాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. జాగంటి లౌర్దయ్య నాయుడు కడప వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా 2017 నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని పక్కా సమాచారంతో నాయుడుపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

ఈ సందర్భంగా విలువైన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, వెండి నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు లౌర్దయ్య నాయుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. 

click me!