ఏపీ ఐసెట్-2019 ఫలితాలు విడుదల: గుంటూరు విద్యార్ధికి ఫస్ట్ ర్యాంక్

Siva Kodati |  
Published : May 08, 2019, 12:38 PM IST
ఏపీ ఐసెట్-2019 ఫలితాలు విడుదల: గుంటూరు విద్యార్ధికి ఫస్ట్ ర్యాంక్

సారాంశం

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఏపీ ఐసెట్-2019 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బుధవారం విజయవాడలో విడుదల చేశారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఏపీ ఐసెట్-2019 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న జరిగిన ఐసెట్‌కు 48,445 మంది విద్యార్ధులు హాజరవ్వగా.. 27న ప్రాథమిక కీని విడుదల చేశారు.

ఫలితాలలో గుంటూరుకు చెందిన నాగసుమంత్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కంటే కావ్యశ్రీ రెండో ర్యాంక్, విజయవాడకు చెందిన శివసాయి మూడో ర్యాంక్ సాధించారు. జూలై 3వ వారంలో ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఛైర్మన్ ప్రకటించారు. ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్