జేసీ దివాకర్ రెడ్డి మాజీ పిఏ ఇంట్లో ఎసీబీ సోదాలు

By narsimha lodeFirst Published Nov 15, 2019, 11:16 AM IST
Highlights

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సురేష్ రెడ్డి నుండి రూ.3 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. 

అనంతపురం: అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై శుక్రవారం నాడు ఏసీబీ సోదాలు నిర్వహించారు. సురేష్ రెడ్డి వద్ద రూ. 3 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్టుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు. 

పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా సురేష్ రెడ్డి  పనిచేస్తున్నారు. చాలా కాలంగా జేసీ దివాకర్ రెడ్డి వద్ద సురేష్ రెడ్డి పనిచేస్తున్నాడు. జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా లేకున్నా కూడ సురేష్ రెడ్డి ఆయన వద్దే పనిచేసేవాడని చెబుతున్నారు. 

Also read:టీడీపీ నేత ఇంటి చూట్టూ నాపా రాళ్ళు పాతిన వైసీపీ నేత!

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జేసీ దివాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని  ఏఈఈ సురేష్ రెడ్డి   అక్రమాస్తులను కూడపెట్టుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.  

ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై  ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే సీజ్ చేసిన బస్సులను వదిలేయాలని ట్రిబ్యునల్  ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడ బస్సులను ఇవ్వకపోవడంపై  జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల మండిపడ్డారు.వైసీపీ నేతలు తనను పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. తనను వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు చేసిన వారం రోజులకే  జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డిపై ఏసీబీ  అధికారులు సోదాలు నిర్వహించడం ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది.ఈ విషయమై జేసీ దివాకర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

click me!