చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

Published : May 31, 2023, 04:23 PM ISTUpdated : May 31, 2023, 04:39 PM IST
చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు: తీర్పు  రిజర్వ్  చేసిన కోర్టు

సారాంశం

ఉండవల్లి  కరకట్టపై  ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్  జర్తు విషయమై  తీర్పును ఏసీబీ  కోర్టు  రిజర్వ్  చేసింది.

విజయవాడ: ఉండవల్లి  కరకట్టపై ఉన్న లింగమనేని  గెస్ట్ హౌస్  జప్తు  విషయమై  ఏపీ సీఐడీ  దాఖలు చేసిన  పిటిషన్  పై ఏపీ సీఐడీ  దాఖలు  చేసిన పిటిషన్ ను  విచారించింది. తీర్పును  ఏసీబీ  కోర్టు  బుధవారంనాడు  రిజర్వ్  చేసింది.  లింగమనేని గెస్ట్ హౌస్ లోనే  చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు. ఇటీవలనే  ఈ గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్  చేసింది.  అయితే  ఈ గెస్ట్ హౌస్ ను  జప్తు చేసేందుకు అనుమతివ్వాలని  ఏపీ సీఐడీ   ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ  లంచ్ బ్రేక్ తర్వాత  ఏసీబీ కోర్టు వాదనలను  విన్నది.

రాజధాని  భూ సేకరణ నుండి  మినహాయించినందునే లింగమనేని గెస్ట్ హౌస్ నపు  చంద్రబాబుకు కేటాయించారని  ఏపీ సీఐడీ ఆరోపణలు  చేస్తుంది.  ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత  తీర్పును రిజర్వ్  చేసింది. ఇవాళ  సాయంత్రం  ఈ విషయమై తీర్పును ఇవ్వనున్నట్టుగా  కోర్టు తెలిపింది. ఇవాళ  సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపుగా  తీర్పును  కోర్టు  ఇవ్వనుంది. 

ఈ గెస్ట్  హౌస్  జప్తునకు  ఉత్తర్వులు ఇవ్వాలని  ఏసీబీ కోర్టులో  ఏపీ సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయమై  నోటీసులు  ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని కూడా సీఐడీ వాదించింది. సీఆర్‌డీఏ అలైన్ మెంట్,  మాస్టర్ ప్లాన్ విషయంలో అవకతవకలు  జరిగాయని సీఐడీ  న్యాయవాది పేర్కొన్నారు.  క్విడ్  ప్రో కో లో భాగంగానే  లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకు కేటాయించారని  సీఐడీ వాదించింది.  అయితే  ఈ విషయమై  క్విడ్ ప్రో కో జరిగిందని  ఆధారాలను సీఐడీ  అందించలేదని  లింగమనేని రమేష్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.  తీర్పును రిజర్వ్  చేస్తున్నట్టుగా  కోర్టు  తెలిపింది. 

also read:బాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు: ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్

2019  లో  వైఎస్ జగన్  సీఎంగా బాధ్యతలు చేపట్టిన  తర్వాత   చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న కాలంలో  తీసుకున్న  నిర్ణయాల్లో అవకతవకలపై   మంత్రివర్గ ఉపసంఘం  ఏర్పాటు  చేసింది.  మంత్రివర్గ ఉప సంఘం  ప్రభుత్వానికి  నివేదిక అందించింది.  చంద్రబాబు సర్కార్   తీసుకున్న  నిర్ణయాల్లో అవకతవకలపై  ఏపీ సీఐడీ విచారణ   నిర్వహిస్తుంది.    ఈ క్రమంలోనే ఉండవల్లి  కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్  ను ఏపీ ప్రభుత్వం  అటాచ్  చేసింది. మరో వైపు  ఈ గెస్ట్ హౌస్  జప్తునకు  ఆదేశాల  కోసం  ఏపీ సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.  ఈ పిటిషన్ పై ఇవాళే ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?