చంద్రబాబు బెయిల్,కస్టడీ పిటిషన్ల పై విచారణ వాయిదా: నేడు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ

By narsimha lode  |  First Published Sep 27, 2023, 1:04 PM IST


చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ నెల  25 వతేదీ నుండి ఈ పిటిషన్ల పై విచారణ వాయిదా పడుతూ వచ్చింది. 


అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై  బుధవారంనాడు మధ్యాహ్నానికి  వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.

చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఈ నెల 25న  సీఐడీ తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ   చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ నెల 14వ తేదీన పిటిషన్లు దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ ఉన్న సమయంలో  బెయిల్ పిటిషన్ పై విచారించవద్దని  సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే  బెయిల్ పిటిషన్ ను ముందుగా దాఖలు చేసినందున  ఈ పిటిషన్ పైనే ముందుగా విచారణ నిర్వహించాలని కోరారు.  అయితే ఈ నెల  25న  ఈ రెండు పిటిషన్లపై విచారణను  ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.  ఈ నెల 26న  ఈ రెండు పిటిషన్లపై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.  

Latest Videos

undefined

అయితే  బుధవారంనాడు ఏసీబీ కోర్టు ప్రారంభం కాగానే   సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని  చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఇరువర్గాల న్యాయవాదులు  మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకున్నాక తన వద్దకు రావాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి  సూచించారు. లంచ్ బ్రేక్ దర్వాత ఈ రెండు పిటిషన్లపై విచారణకు  ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించారు.ఇదే విషయాన్ని  ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెప్పారు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత  చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై విచారణ నిర్వహిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.

also read:చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా: బాబు న్యాయవాదులపై జడ్జి అసహనం

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  ఈ నెల 23,24 తేదీల్లో సీఐడీ విచారించింది. అయితే  ఈ రెండు రోజుల పాటు విచారణకు సహకరించలేదని సీఐడీ తరపు న్యాయవాదులు ఆరోపించారు. మరో ఐదు రోజుల కస్టడీ కోరుతూ  పిటిషన్ దాఖలు చేశారు. 

click me!