ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యత: అసెంబ్లీలో జీపీఎస్ బిల్లు పెట్టిన బుగ్గన

By narsimha lode  |  First Published Sep 27, 2023, 12:37 PM IST

ఏపీ అసెంబ్లీలో జీపీఎస్ బిల్లును  ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీలో  జీపీఎస్ బిల్లును  ఏపీ ప్రభుత్వం  బుధవారంనాడు ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగించారు.  ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును  పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.జీపీఎస్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ. 2500 కోట్ల భారం పడే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.

పాత పెన్ష‌న్ విధానం అమ‌లు చేస్తే 2050 నాటికి రూ. 49 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు.స్థూల ఉత్పత్తిపై పెన్షన్ కు చేసే వ్యయం 107 శాతానికి వెళ్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. 2024,2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేమేమీ చేయడం లేదన్నారు. జీపీఎస్ ను భవిష్యత్ లో దేశవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.చాలా రాష్ట్రాలు  జీపీఎస్  విధానాన్ని చూసి ఆశ్చర్య పోతున్నాయన్నారు. 

Latest Videos

undefined

ఉద్యోగి విరమణ చేసే సమయానికి చివరి నెల వేతనంలో 50 శాతం పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్ విధానాన్ని రూపొందించామన్నారు. భార్య లేదా భ‌ర్త‌కు కూడా 60 శాతం పెన్షన్ ఇచ్చేలా  రూపకల్పన చేసినట్టుగా మంత్రి వివరించారు.ఇంత‌కు ముందు డీఆర్ లేదు...ఇప్పుడు డీఆర్ ఉందన్నారు. 

ఇంత‌కు ముందు ఈహెచ్ ఎస్ లేదు...ఇప్పుడు ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గ‌తంలో 25 శాతం గ్యారంటీ లేదు...కానీ 50 శాతం గ్యారంటీగా ఇస్తున్నామన్నారు. ఉద్యోగులంతా అర్ధం చేసుకుని స‌పోర్ట్ చేయాల‌ని కోరుతున్నట్టుగా మంత్రి వివరించారు. 

ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. 2014 నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  తెలిపారు.ఆశా వర్కర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

 ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న  సమయంలో  సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ కు బదులుగా జీపీఎస్ ను తీసుకు వస్తామని  ఏపీ ప్రభుత్వం ప్రకటించంది. అయితే జీపీఎస్ ను కూడ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు.జీపీఎస్  వల్ల కూడ  ఉద్యోగులకు ప్రయోజనం దక్కదని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు జీపీఎస్ ను స్వాగతిస్తున్నాయి.
 

click me!