నిన్న హైకోర్టులో బెయిల్ పిటిషన్: పితాని మాజీ పీఎస్‌ను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ

By narsimha lodeFirst Published Jul 10, 2020, 1:39 PM IST
Highlights

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ ను శుక్రవారం నాడు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ ను శుక్రవారం నాడు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

సచివాలయంలో ఇవాళ విధుల్లో ఉన్న మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు సురేష్, మాజీ పీఎస్ మురళీమోహన్ లు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.  ఈ విషయమై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

also read:ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్:మాజీ మంత్రి పితాని తనయుడు ముందస్తు బెయిల్ పిటిషన్

ఇవాళ ఉదయం ఏపీ సచివాలయంలో మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ బాధ్యతలను పితాని సత్యనారాయణ చేపట్టారు.

విజిలెన్స్ నివేదికలో పితాని సత్యనారాయణ పేరు కూడ ఉందని ప్రచారం సాగింది.ఈ విషయమై వైసీపీ నేతలు గతంలో పితాని సత్యనారాయణ పేరును ప్రస్తావించారు. ఈ ఆరోపణలను పితాని ఖండించారు.

అయితే పితాని సత్యనారాయణ తనయుడు సురేష్, మాజీ పీఎస్ మురళీమోహన్ లు ముందస్తు బెయిల్ కోరుతూ ధరఖాస్తు చేసుకోవడంతో రాజకీయంగా కలకలం రేగింది.ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

click me!