భర్త ఆచూకీ చెప్పాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట మహిళ బైఠాయింపు.. అక్కడే ఆత్మహత్యాయత్నం..

Published : Oct 02, 2023, 08:09 AM IST
భర్త ఆచూకీ చెప్పాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట మహిళ బైఠాయింపు.. అక్కడే ఆత్మహత్యాయత్నం..

సారాంశం

బెయిల్ పై విడుదలైన తన భర్తను మళ్లీ పిలిపించి.. ఇంకా పోలీసులు ఇంటికి పంపించలేదని ఓ మహిళ పోలీసు స్టేషన్ ఎదుట తన బంధువులు, పిల్లలతో కలిసి బైఠాయించింది. అనంతరం అక్కడే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.

ఓ మహిళ పోలీసు స్టేషన్ ఎదుటే అఘాయిత్యానికి పాల్పడింది. తన భర్త ఆచూకీ తెలియజేయాలంటూ అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగింది. 

అనకాపల్లిలో అర్థరాత్రి ఉద్రిక్తత.. మాజీ మంత్రి బాండారు ఇంటి సమీపంలోకి భారీగా చేరుకున్న పోలీసులు

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎరుకలి మురళి అనే వ్యక్తి నివసిస్తున్నారు. అయితే ఆయన ఐదు నెలల కిందట అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. అయితే నిందితుడు శుక్రవారం బెయిల్ పై విడుదలయ్యాడు. మళ్లీ విచారణ జరిపి వెంటనే పంపిస్తామని పోలీసులు ఆయనను పిలిపించారు. 

Ujjain Rape| "ఆ చిన్నారికి నా చొక్కానే ఇచ్చా.." : కీలక విషయాలను వెల్లడించిన ఆటో డ్రైవర్‌

కాగా.. ఇంకా తన భర్తను ఇంటికి పంపించడం లేదంటూ నిందితుడి భార్య, తన ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి డోన్ టౌన్ పోలీసు స్టేష్ ఎదుట బైఠాయించింది. వారంతా కలిసి ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. మరళిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం అతడిని కడప సెంట్రల్ జైలుకు తీసుకెళ్లామని వివరించారు.

కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి..

దీంతో మనస్థాపానికి గురైన నిందితుడి భార్య అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే మురళిపై ఇప్పటికే మొత్తం 11 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అందుకే కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నిందితుడిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అనంతరం జైలు తరలించామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్