కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి..

Published : Oct 02, 2023, 07:34 AM IST
కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి..

సారాంశం

ఓ దంపతులు తమ రెండేళ్ల కుమారుడిని తీసుకొని కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బైక్ ను ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు.

కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై రెండేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాల మండలంలోని చిత్తపార గ్రామంలో రాజేశ్-రాధ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి రెండేళ్ల మన్ మోహిత్ అనే కుమారుడు ఉన్నాడు.

అనకాపల్లిలో అర్థరాత్రి ఉద్రిక్తత.. మాజీ మంత్రి బాండారు ఇంటి సమీపంలోకి భారీగా చేరుకున్న పోలీసులు

అయితే వీరంతా కలిసి వళ్లియప్పనగర్ ప్రాంతంలో కృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. కాగా.. ఈ దంపతులు తమ కుమారుడిని తీసుకొని బైక్ పై ఆదివారం కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవాలనుకున్నారు. అయితే వీరు బైక్ పై ప్రయాణం ప్రారంభించిన కొంత సమయం తరువాత ఇరువారం పాత వంతెన వద్దకు చేరుకున్నారు. దానిపై గుంతలు ప్రమాకరంగా ఉన్నాయి. దీంతో ఆయన ఎడమ వైపు నుంచి బైక్ ను నడిపారు. అదే సమయంలో బైపాస్ రోడ్డు నుంచి ఎదురుగా ఓ కంటైనర్ వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. 

Ujjain Rape| "ఆ చిన్నారికి నా చొక్కానే ఇచ్చా.." : కీలక విషయాలను వెల్లడించిన ఆటో డ్రైవర్‌

మన్ మోహిత్ కింద పడటంతో బాలుడిపై కంటైనర్ చక్రం ఎక్కింది. దీంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి గోతులే కారణమని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అప్పటికప్పుడు వాహనాలు నిలిపివేశారు. అనంతరం జేసీబీ సాయంతో గుంతలను పూడ్చారు. 

PREV
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu