ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక ప్రశ్న

First Published Sep 13, 2017, 8:51 AM IST
Highlights

పూర్తి కాక ముందే ప్రాజక్టులు ప్రారంభించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహంగా మార్చుకున్నారు.

డిసెంబర్‌ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్త పట్నం లిఫ్టును  ఆగస్ట్‌లోనే జాతికి అంకితం చేశారు. ఎందుకు? వివరంగా చెబుతే వింటాం...
 

అని రాజమండ్రి మాజీ లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

నేపథ్యం...

 

సాధారణంగా  చాలా ప్రాజక్టులు ప్రారంభోత్సవాలకు నోచుకోవు. నాయకులు టైం ఇవ్వక, ముహూర్తం దొరక్క మూలనపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి రాకూడనేనోమా,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ముందు ముందుగానే ప్రాజక్టులు ప్రారంభిస్తున్నారు. ప్రాజక్టు ఎపుడు పూర్తవుతుందో తెలియదు,నీరుందో లేదో తెలియదు, ముందయితే ప్రారంభిస్తామని ముందుకు పోతున్నారు.  గోదావరి మీద కట్టిన పట్టి సీమను ఇలాగే ప్రారంభించారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఇలాగే ప్రారంభమయింది. ఈ ప్రాజక్టు మళ్లీ మొన్న ప్రారంభమయింది. ఈ వరసలో పురుషోత్తం పట్నం లిఫ్ట్ ను కూడా ముఖ్యమంత్రి ముందే జాతికి అంకితమిచ్చారు. ఈ చరిత్రను గుర్తు చేస్తూ  ఉండవల్లి ఈ ప్రశ్న వేశారు.

click me!