భారీగా పడిపోయిన కేసులు: ఏపీలో 8,88,099కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Feb 03, 2021, 09:39 PM IST
భారీగా పడిపోయిన కేసులు: ఏపీలో 8,88,099కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 95 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కోవిడ్ సోకిన వారి సంఖ్య 8,88,099కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 95 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కోవిడ్ సోకిన వారి సంఖ్య 8,88,099కి చేరింది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,157కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,79,780 చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,455 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటి వరకు కోవిడ్ నిర్థారణా పరీక్షల సంఖ్య 1,32,14,548కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజే అనంతపురం 5, చిత్తూరు 9, తూర్పుగోదావరి 7, గుంటూరు 16, కడప 1, కృష్ణా 17, కర్నూలు 4, నెల్లూరు 7, ప్రకాశం 0, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 16, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Tourism Minister Kandula Durgesh Super Speech at Amaravati Avakaya Festival | Asianet News Telugu
IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం