ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: కొత్తగా 947 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో తీవ్రత

Siva Kodati |  
Published : Mar 27, 2021, 04:59 PM IST
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: కొత్తగా 947 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో తీవ్రత

సారాంశం

భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో 500లకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా వుంది

భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో 500లకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నారు.

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 947 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,97,810కి చేరుకుంది.

నిన్న కరోనా వల్ల ఏ ఒక్కరు చనిపోలేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 7,203గా వుంది. గడిచిన 24 గంటల్లో 377 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,85,892కి చేరింది. నిన్న ఏపీలో 42,696 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 1,49,58,897కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 35, చిత్తూరు 180, తూర్పుగోదావరి 58, గుంటూరు 145, కడప 40, కృష్ణ 113, కర్నూలు 61, నెల్లూరు 43, ప్రకాశం 23, శ్రీకాకుళం 56, విశాఖపట్నం 156, విజయనగరం 19, పశ్చిమ గోదావరిలలో 18 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu