తగ్గని ఉద్థృతి: ఏపీలో రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు

By Siva KodatiFirst Published Aug 11, 2020, 6:32 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. తాజాగా మంగళవారం కొత్తగా 9,024 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 44 వేల 549కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. తాజాగా మంగళవారం కొత్తగా 9,024 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 44 వేల 549కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 87 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,203కి చేరింది.

అత్యథికంగా అనంతపురంలో 13 మంది మృతచెందగా.. ఆ తర్వాత చిత్తూరు 12, గుంటూరు 9, ప్రకాశం 7, విశాఖ 7, కడప 6, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 6, తూర్పుగోదావరి 5, నెల్లూరు 5, విజయనగరం 5, కృష్ణా 3, కర్నూలుల్లో ముగ్గురు చొప్పున మరణించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 87, 597 యాక్టివ్ కేసులుండగా... ఇప్పటి వరకు 1,54,749 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కోవిడ్ టెస్టులు చేయగా... ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 25,92,619కి చేరింది.

గత 24 గంటల్లో 9,113 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,372 మందికి కోవిడ్‌గా తేలింది. ఆ తర్వాత అనంతపురం 959, చిత్తూరు 758, గుంటూరు 717, కడప 579, కృష్ణా 342, కర్నూలు 1,138, నెల్లూరు 364, ప్రకాశం 343, శ్రీకాకుళం 504, విశాఖపట్నం 676, విజయనగరం 594, పశ్చిమ గోదావరిలలో 678 కేసులు వెలుగు చూశాయి. 

 

: 11/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,41,654 పాజిటివ్ కేసు లకు గాను
*1,51,854 మంది డిశ్చార్జ్ కాగా
*2,203 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,597 pic.twitter.com/LgYIdY4zS8

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

 

click me!