ఏపీలో కరోనా జోరు: కొత్తగా 8,218 కేసులు.. 6,17,776కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 19, 2020, 05:34 PM IST
ఏపీలో కరోనా జోరు: కొత్తగా 8,218 కేసులు.. 6,17,776కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.

నిన్న ఒక్క రోజే వైరస్ కారణంగా 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,302కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 81,763 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 10,820 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే 74,595 మంది శాంపిల్స్ పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 50,33,676కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 477, చిత్తూరు 736, తూర్పుగోదావరి 1,395, గుంటూరు 471, కడప 520, కృష్ణ 468, కర్నూలు 319, నెల్లూరు 693, ప్రకాశం 670, శ్రీకాకుళం 485, విశాఖపట్నం 451, విజయనగరం 462, పశ్చిమ గోదావరిలలో 1,071 కేసులు నమోదయ్యాయి.

అలాగే నిన్న ఒక్క రోజే చిత్తూరు 9, కృష్ణ 7, అనంతపురం 5, గుంటూరు 5, కడప 5, పశ్చిమ గోదావరి 5, నెల్లూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి 3, కర్నూలు 3, శ్రీకాకుళం 3, విజయనగరంలలో ఒక్కరు చొప్పున మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు