ఏపీలో భారీగా పడిపోయిన కేసులు... ఒక్కరోజులో 809 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

Siva Kodati |  
Published : Oct 01, 2021, 08:03 PM IST
ఏపీలో భారీగా పడిపోయిన కేసులు... ఒక్కరోజులో 809 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు నమోదవ్వగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,160 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 11,142 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు మరోసారి 1000లోపే నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 809 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,48,238కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,186కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు 2, కృష్ణ 2, గుంటూరు 3, నెల్లూరు 2, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,160 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,22,910కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 56,463 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,83,50,167కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 11,142మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 153, తూర్పుగోదావరి 161, గుంటూరు 78, కడప 16, కృష్ణ 54, కర్నూలు 2, నెల్లూరు 115, ప్రకాశం 83, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 39, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 93 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu