బలవంతంగా ఇంట్లోకి చొరబడి... ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Apr 18, 2021, 12:31 PM IST
బలవంతంగా ఇంట్లోకి చొరబడి... ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

సారాంశం

చిన్నారులు, యువతులనే కాదు చివరకు వృద్ధులనూ వదిలిపెట్టడం లేదు కామాంధులు. తాజాగా 80ఏళ్ళ వృద్ధురాలిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   

గుంటూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నారులు, యువతులనే కాదు చివరకు వృద్ధులనూ వదిలిపెట్టడం లేదు కామాంధులు. తాజాగా 80ఏళ్ళ వృద్ధురాలిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామానికి చెందిన సీతమ్మ(80) ఒంటరిగా జీవిస్తోంది. ఏడాది క్రితమే ఆమె భర్త చనిపోగా కొడుకు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతంలో నివాసముంటున్నాడు. దీంతో సీతమ్మ ఒక్కటే కిష్కిందపాలెంలో వుంటోంది. 

read more   అక్రమ బంధానికి అడ్డుగావుందని... కన్న తల్లే కూతురిని చంపేసిందా..?

ఇలా వృద్ధురాలు ఒంటరిగా వుంటున్న విషయాన్ని గుర్తించిన ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఎవరో ఇంటి తలుపు తట్టడంతో సీత‌మ్మ తెలిచింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు తలుపు గడియ పెట్టేసి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. 

తనపై జరిగిన అఘాయిత్యం గురించి సీతమ్మ స్థానికులకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు సీతమ్మ నుండి వివరాలను సేకరించారు. ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలు ఒంటరిగా వుంటుందని తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?