వైసీపీవి దొంగ సర్వేలు, మనమే క్లీన్ స్వీప్ చేస్తాం : కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published 19, Feb 2019, 9:19 PM IST
Highlights

ఈసారి రాబోయే ఎన్నికల్లో 16 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చెయ్యాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దశాబ్ధాల కాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పోర్టును ప్రారంభించామని, అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జిల్లాకు సాగునీటిని అందించి వారి కల నెరవేర్చామన్నారు. 
 

విజయవాడ: కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నేతలతో సమావేం నిర్వహించారు. 

ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఈసారి ఏకపక్షం కావాలని ఆదేశించారు. అందుకు ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచెయ్యాలని సూచించారు. గత ఎన్నికల్లో 16 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 స్థానాల్లో విజయం సాధించామని అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందామని చెప్పారు. 

ఈసారి రాబోయే ఎన్నికల్లో 16 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చెయ్యాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దశాబ్ధాల కాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పోర్టును ప్రారంభించామని, అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జిల్లాకు సాగునీటిని అందించి వారి కల నెరవేర్చామన్నారు. 

వాటితోపాటు జిల్లాలో పెద్ద ఎత్తున మౌళిక సదుపాయాలు కల్పించామన్నారు.  మక్త్యాల ఎత్తిపోథల పథకాన్ని కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అప్పుడే గెలుపు ఏకపక్షమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం తెలుగుదేశంపై ప్రజల్లో మంచి సానుకూలత ఉందని మంచి ఊపు, ఉత్సాహం ఉందని వాటిని క్యాష్ చేసుకోవాలని సూచించారు. ఇగో సమస్యలు వదిలి క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం కావాలంటూ దిశానిర్దేశం చేశారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది పడతామని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. 

మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలను నమ్మెుద్దని హితవు పలికారు. వైసీపీ దొంగ సర్వేలు చేయిస్తోందని తెలిపారు. వైసీపీ దొంగ సర్వేలు బయటపడతాయన్న భయంతోనే ఇతర సర్వేలను అడ్డుకుంటుందని చంద్రబాబు విమర్శించారు.  

ఓటమి భయంతోనే దొంగ సర్వేలు, దొంగ ఓట్లు అంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ జగన్ టీఆర్ఎస్, బీజేపీతో ఉన్నారని ఆ మూడు పార్టీల కుట్రలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చంద్రబాబు అన్నారు.    
 

Last Updated 19, Feb 2019, 9:19 PM IST