
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గడిచిన కొద్దిరోజులుగా 500 లోపే నమోదవుతున్న రోజువారీ కేసులు .. ఇవాళ అనూహ్యంగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 758 మందికి పాజిటివ్‌గా తేలింది.
వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 8,95,879కి చేరుకుంది. కోవిడ్ కారణంగా నిన్న ఒక్కరోజు చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
దీంతో వైరస్ వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,201కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 231 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,85,209కి చేరుకుంది.
నిన్న 35,196 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 1,48,75,597కి చేరింది.
గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 56, చిత్తూరు 175, తూర్పుగోదావరి 45, గుంటూరు 127, కడప 24, కృష్ణా 80, కర్నూలు 27, నెల్లూరు 33, ప్రకాశం 30, శ్రీకాకుళం 27, విశాఖపట్నం 98, విజయనగరం 23, పశ్చిమ గోదావరిలలో 13 మంది కరోనా బారినపడ్డారు.