కొత్తగా 75 కేసులు.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,350కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Feb 06, 2021, 06:29 PM IST
కొత్తగా 75 కేసులు.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,350కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు మరోసారి భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 మందికి కోవిడ్ సోకినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,88,350కి చేరింది

ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు మరోసారి భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 మందికి కోవిడ్ సోకినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,88,350కి చేరింది.

కోవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ఒకరు మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,159కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1012 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 133 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,80,179కి చేరింది. గత 24 గంటల్లో 34,864 మందికి కరోనా టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నిర్థారణా పరీక్షల సంఖ్య 1,33,11,542కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 6, చిత్తూరు 16, తూర్పుగోదావరి 13, గుంటూరు 3, కడప 2, కృష్ణ 11, కర్నూలు 4, నెల్లూరు 3, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 10, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?