కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్రత: ఏపీలో 8.66 లక్షలకు చేరిన కరోనా కేసులు

By Siva KodatiFirst Published Nov 27, 2020, 7:37 PM IST
Highlights

గత 24 గంటల్లో ఏపీలో 733 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. నిన్న ఒక్క రోజు కోవిడ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6,976కి చేరుకుంది

గత 24 గంటల్లో ఏపీలో 733 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,66,438కి చేరింది.

నిన్న ఒక్క రోజు కోవిడ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6,976కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 12,137 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 1,205 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,47,325కి చేరింది. నిన్న ఒక్కరోజు 57,752 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 99,13,068కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 40, చిత్తూరు 74, తూర్పుగోదావరి 65, గుంటూరు 112, కడప 33, కృష్ణ 102, కర్నూలు 21, నెల్లూరు 29, ప్రకాశం 13, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 73, విజయనగరం 31, పశ్చిమ గోదావరిలలో 118 కేసులు నమోదయ్యాయి.

అలాగే కరోనా వల్ల కృష్ణ 2, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

 

 

: 27/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,63,543 పాజిటివ్ కేసు లకు గాను
*8,44,430 మంది డిశ్చార్జ్ కాగా
*6,976 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,137 pic.twitter.com/pOXHTS1rlQ

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!
Last Updated Nov 27, 2020, 7:37 PM IST
click me!