కొత్తగా 7,293 మందికి కరోనా: ఏపీలో 6,68,751కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Sep 26, 2020, 06:18 PM IST
కొత్తగా 7,293 మందికి కరోనా: ఏపీలో 6,68,751కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కరోనా జోరు కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,293 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కి చేరింది

ఏపీలో కరోనా జోరు కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,293 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కి చేరింది. నిన్న ఒక్కరోజే 57 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 5,663కి చేరుకుంది.

గత 24 గంటల్లో 9,125 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 5,97,294కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 65,794 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 75,990 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 55,23,786కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో ప్రకాశం 10, చిత్తూరు 8, కడప 8, కృష్ణ 6, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, పశ్చిమ గోదావరి 4, గుంటూరు 3, నెల్లూరు 3, అనంతపురం 2, శ్రీకాకుళం 2, కర్నూలు, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

అలాగే, అనంతపురం 513, చిత్తూరు 975, తూర్పుగోదావరి 1,011, గుంటూరు 393, కడప 537, కృష్ణ 450, కర్నూలు 206, నెల్లూరు 466, ప్రకాశం 620, శ్రీకాకుళం 306, విశాఖపట్నం 450, విజయనగరం 444, పశ్చిమ గోదావరిలలో 922 కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu