రాష్ట్రానికి లక్ష కోట్లు తీసుకొస్తా.. 70 శాతం నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు... కేఏ పాల్

Published : May 04, 2023, 02:41 PM IST
రాష్ట్రానికి లక్ష కోట్లు తీసుకొస్తా.. 70 శాతం నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు... కేఏ పాల్

సారాంశం

ఏపీలోని 70 శాతంమంది తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. తాను రాష్ట్రానికి లక్షకోట్లు తీసుకువస్తానని చెప్పారు. 

విశాఖపట్నం : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా కేసీఆర్ మద్దతుతోనే ఐదు శాతం స్థానాలు పొందారని చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో గూడుకట్టుకుంటున్న అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతిపై విచారణకు సిట్ ను  ఆహ్వానించడం హర్షించదగిన పరిణామం అన్నారు. అయితే నాలుగేళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

అంతేకాదు సిబిఐతో కూడా ఎంక్వయిరీ చేయించాలని అన్నారు. బొత్సకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని దీనిమీద సిట్ విచారణ జరిపించాలని కోరారు. ఉచిత విద్యను ఏ ప్రభుత్వమైనా, ఎవరికైనా ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. 17 లక్షల మందికి తాను ఉచిత విద్యను అందించానని చెప్పుకొచ్చారు. దీంతోపాటు.. ఢిల్లీ రాజకీయాల గురించి కూడా కేఏ పాల్ మాట్లాడారు. ‘ప్రజలు కేజ్రీవాల్ ను గెలిపించారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని.. తనను ఎందుకు ఏపీ ప్రజలు గెలిపించరని ప్రశ్నించారు.  

అకాల వర్షాలు.. ప్రతి రైతుకూ పరిహారం అందాలి, బాధ్యత మీదే : అధికారులతో సీఎం జగన్

60, 70శాతం ప్రజలు  తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని కేఏ పాల్ అన్నారు. త్వరలో రాష్ట్రానికి తాను ఎనిమిది లక్షల కోట్లు తీసుకురాబోతున్నానని.. అది ప్రజలు చూస్తారని అన్నాడు. చంద్రబాబు వస్తే మింగేస్తాడని నేను బిజెపి పెద్దలకు చెప్పాను. ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు. వైసీపీలో ఉన్న అవినీతిపరులందరినీ విచారించాలి. ఇన్నేళ్ల వైసిపి పాలనలో రాష్ట్ర ఆదాయం పెరగలేదు. కానీ అప్పులు, అక్రమాలు పెరిగాయి’ అని కేఏ పాల్ విమర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu