అల్లూరి జిల్లాలో వరుస మరణాలు : కిండలంలో 10 రోజుల్లో ఏడుగురు మృతి

Published : Mar 30, 2023, 11:54 AM IST
అల్లూరి  జిల్లాలో  వరుస మరణాలు :  కిండలంలో  10 రోజుల్లో  ఏడుగురు మృతి

సారాంశం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో  వరుస మరణాలు  స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.  కిండలం గ్రామంలో  ఏడుగురు మృతి చెందారు. 

విశాఖపట్టణం: అల్లూరి  సీతారామరాజు జిల్లాలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.  ఇప్పటికే  ఈ జిల్లాలో ఏడుగురు మృతి చెందారు.  వైద్య శిబిరం ఏర్పాటు  చేసి  చికిత్స  అందిస్తున్నా  మరణాలు ఆగడం లేదు.

జిల్లాలోని పెదబయలు మండలం కిండలంలో  అంతుచిక్కని వ్యాధితో  స్థానికులు  మృత్యువాత పడుతున్నారు.   సుమారు పది  రోజుల వ్యవధిలోనే  ఏడుగురు మరణించారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  ఈ విషయం తెలిసిన  వైద్య సిబ్బంది  గ్రామంలో  వైద్య శిబిరం ఏర్పాటు  చేశారు.    మరణించిన వారి నుండి  నమూనాలు సేకరించి  ల్యాబ్ కు పంపారు.  ఈ మరణాలకు సంబంధించి  అధికారులు  ఎలాంటి నిర్ధారణకు  రాలేదు.   నిన్న, ఇవాళ  ఇద్దరు మరణించడంతో  ఈ గ్రామంలో  మరణించిన వారి సంఖ్య  ఏడుకి  చేరుకుంది. 

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu