ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. కామాంధుడికి పదేళ్ల జైలు శిక్ష

Published : Jul 06, 2019, 11:15 AM IST
ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. కామాంధుడికి పదేళ్ల జైలు శిక్ష

సారాంశం

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది.

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా సంగం మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన 2014లో చోటుచేసుకోగా..న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు నాన్నమ్మతో కలిసి ఉంటున్నారు. 2014 నవంబర్ 25న బాలుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతడిని ఇంట్లోనే ఉంచి నాన్నమ్మ పనికి వెళ్లింది. 

మధ్యాహ్న సమయంలో బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన యర్రబెల్లి పెంచలరావు అనే వ్యక్తి బొంగరం కొనిస్తానని చెప్పి అతడిని సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బాలుడిపై లైంగిక దాడికి  పాల్పడ్డాడు. అతను చేసిన చర్యకు బిత్తరపోయిన బాలుడు తర్వాత తేరుకొని కేకలు పెట్టాడు. 

గమనించిన స్థానికులు అటువైపు రాగా.. పెంచలరావు బాలుడిని అక్కడ వదిలేసి పరారయ్యాడు. కాగా.. బాలుడు నానమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధించారు. 

PREV
click me!

Recommended Stories

Vizag Roads Deserted During Sankranthi Festival: నిర్మానుష్యంగా వైజాగ్ రోడ్లు | Asianet News Telugu
Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu