జూనియర్ ఎన్టీఆర్ పై నాదెండ్ల షాకింగ్ కామెంట్స్

Published : Jul 06, 2019, 09:07 AM IST
జూనియర్ ఎన్టీఆర్ పై నాదెండ్ల షాకింగ్ కామెంట్స్

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు... సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు... సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక టీడీపీ పని అయిపోయిందని.. ఆ పార్టీకి పునర్వైభవం రావాలంటే... జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేననే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంపై నాదెండ్ల భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల.. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను సినిమాలు చూడనని చెప్పారు. అయినా ఈ విషయం పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా నాదెండ్ల భాస్కర్ రావు స్పందించారు. 

జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు. తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని పరోక్షంగా భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. అటు తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం ఓ తప్పిదమని పరోక్షంగా అన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu