తిరుపతిలో కిడ్నాప్... బెజవాడలో ప్రత్యక్షం: బాలుడి అదృశ్యం కేసు సుఖాంతం

By Siva KodatiFirst Published Mar 13, 2021, 6:11 PM IST
Highlights

తిరుపతిలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాపర్లు విజయవాడ దుర్గగుడి దగ్గర వదిలి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ పోలీసులు అలిపిరి పోలీసులకు తెలియజేశారు. రేపు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం వుంది. 

తిరుపతి అలిపిరి లింక్‌ బస్టాండ్‌లో గత నెల 27న బాలుడు సాహూ అపహరణకు గురయ్యాడు. ఈ చిన్నారి తల్లిదండ్రులది ఛత్తీస్‌గఢ్‌. కిడ్నాప్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు..  బాలుడిని అపహరించినట్లుగా భావిస్తున్న నిందితుడి కుటుంబాన్ని గుర్తించారు.   

చిత్తూరు జిల్లా వి.కోట పరిసర గ్రామానికి చెందిన శివప్పను నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు రెండ్రోజుల క్రితమే కిడ్నాపర్‌ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న వి.కోట పోలీసులు .. వారి నుంచి వివరాలు రాబట్టారు.

శివప్ప ఎక్కడ ఉన్నాడో తెలియదని చెబుతున్న  కుటుంబ సభ్యులు.. నిందితుడికి ఉన్న ఇద్దరి కుమారుల్లో ఒకరు ఇటీవలే జ్వరంతో మరణించారని పోలీసులకు తెలిపారు.

వి.కోటలో చిన్నపిల్లలను అపహరించి విక్రయించే ముఠా సైతం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ఆ ముఠాకు చెందిన సభ్యుడా? లేక బాలుడిని పెంచుకోవడానికి కిడ్నాప్‌ చేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
click me!