కొత్తగా 55 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,869కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 14, 2021, 08:02 PM IST
కొత్తగా 55 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,869కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవుతూనే వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 55 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 8,88,869కి చేరింది.

కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7,162కి చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 117 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వీటితో కలిపి ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,80,972కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 735 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న కొత్తగా 28,788కి కరోనా నిర్థారణా పరీక్షలు చేయడంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన టెస్టుల సంఖ్య 1,25,46,228కి చేరింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 6, చిత్తూరు 9, తూర్పు గోదావరి 4, గుంటూరు 6, కడప 5, కృష్ణ 6, కర్నూలు 1, నెల్లూరు 6, ప్రకాశం 0, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 2, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 9 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?