ఆంధ్రప్రదేశ్‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 547 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,76,028కి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 547 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,76,028కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,500కి చేరుకుంది.
24 గంటల్లో కరోనా నుంచి 128 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,59,262కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 33,339 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,14,92,070కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,266 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 36, చిత్తూరు 96, తూర్పుగోదావరి 43, గుంటూరు 49, కడప 15, కృష్ణ 66, కర్నూలు 6, నెల్లూరు 42, ప్రకాశం 15, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 89, విజయనగరం 25, పశ్చిమ గోదావరిలలో 43 చొప్పున వైరస్ బారినపడ్డారు.
undefined
మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. మరోసారి రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 90 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా Covidతో 325 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది. నిన్న దేశంలో కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,41,009కి చేరంది. ప్రస్తుతం దేశంలో 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.81 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని పేర్కొంది. వీక్లీ పాజిటివ్ రేటు 3.47 శాతంగా ఉన్నట్టుగా వెల్లడించింది. దేశంలో బుధవారం మరో 91,25,099 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,48,67,80,227కి చేరింది.
అటు Omicron Varient కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో గురువారం ఉదయం నాటికి 2,630 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 995 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 797 ఒమిక్రాన్ కేసుల నమోదయ్యాయి. 465 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలో మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది.
: 06/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,76,028 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,262 మంది డిశ్చార్జ్ కాగా
*14,500 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,266 pic.twitter.com/4Py9RNkDzY