విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్, అధికారుల్లో ఆందోళన

By Siva KodatiFirst Published May 20, 2021, 9:53 PM IST
Highlights

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం 127 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. వీరందరికి జైలులోనే చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇతర ఆస్పత్రులకు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. 

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం 127 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. వీరందరికి జైలులోనే చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇతర ఆస్పత్రులకు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,21,142కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 114 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9800కి చేరుకుంది.

Also Read:బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఊరట.. ఈ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స, ఏపీ సర్కార్ ఆదేశాలు

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 9, తూర్పుగోదావరి 10, చిత్తూరు 15, గుంటూరు 10, కర్నూలు 7, నెల్లూరు 5, కృష్ణ 8, విశాఖపట్నం 10, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 17, ప్రకాశం 5,  కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 22,610 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,02,208కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 23,098 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,83,42,918కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,09,134 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1794, చిత్తూరు 3185, తూర్పుగోదావరి 3602, గుంటూరు 1584, కడప 989, కృష్ణ 1084, కర్నూలు 1178, నెల్లూరు 1219, ప్రకాశం 1523, శ్రీకాకుళం 1517, విశాఖపట్నం 1984, విజయనగరం 885, పశ్చిమ గోదావరిలలో 2066 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

click me!