ఏపీ: 24 గంటల్లో 483 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,58,392కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Oct 19, 2021, 06:46 PM IST
ఏపీ: 24 గంటల్లో 483 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,58,392కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 483 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 534 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,654 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 483 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,58,392కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,317కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఇద్దరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 534 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,38,421 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 40,191 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,90,56,256 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,654 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 2, చిత్తూరు 120, తూర్పుగోదావరి 25, గుంటూరు 61, కడప 2, కృష్ణ 81, కర్నూలు 3, నెల్లూరు 32, ప్రకాశం 55, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 32, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 53 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?