ఏపీలో కొత్తగా 4,038 కేసులు: 7 లక్షల 71 వేలకు చేరిన సంఖ్య

By Siva KodatiFirst Published Oct 15, 2020, 6:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,767 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,038 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 73,767 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,038 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది.

అలాగే నిన్న ఒక్కరోజు వైరస్ కారణంగా 38 మంది మృతి చెందారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మరణాల సంఖ్య 6,357కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 4,00,47 కేసులున్నాయి. గత 24 గంటల్లో 5,622 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,25,099కి చేరింది. ఏపీలో నిన్న జరిపిన పరీక్షలతో కలిపి ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 68,46,040కి చేరుకుంది. 24 గంటల్లో అనంతపురం 232, చిత్తూరు 489, తూర్పు గోదావరి 548, గుంటూరు 390, కడప 281, కృష్ణ 421, కర్నూలు 103, నెల్లూరు 178, ప్రకాశం 299, శ్రీకాకుళం 119, విశాఖపట్నం 196, విజయనగరం 96, పశ్చిమగోదావరిలలో 686 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు 9, ప్రకాశం 7, కృష్ణ 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, విశాఖపట్నం 3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 

click me!