బర్త్‌డేకు ఏర్పాట్లు, అంతలోనే విషాదం: కన్నీరు మున్నీరైన ఫ్యామిలీ

Published : Jul 30, 2020, 01:16 PM ISTUpdated : Jul 30, 2020, 01:49 PM IST
బర్త్‌డేకు ఏర్పాట్లు, అంతలోనే విషాదం: కన్నీరు మున్నీరైన ఫ్యామిలీ

సారాంశం

పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే విజయవాడలో నాలుగేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


విజయవాడ:  పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే విజయవాడలో నాలుగేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

విజయవాడ వన్ టౌన్ కు చెందిన  నాలుగేళ్ల బాలుడు నీటి సంపులో పడి చనిపోయాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ఆలస్యం గా గుర్తించారు. ఈ నెల 31వ తేదీన బాలుడి పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకల కోసం కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

also read:బర్త్‌డేకు ఏర్పాట్లు, అంతలోనే విషాదం: కన్నీరు మున్నీరైన ఫ్యామిలీ

ఆడుకొంటూ నాలుగేళ్ల బాలుడు నీటి సంపులో పడి మరణించాడు.బాలుడిని చూసిన తల్లిదండ్రులు నీటి సంపు నుండి తీసేసరికి అతను చనిపోయాడు. 
రెండు రోజుల తర్వాత పుట్టిన రోజులు జరుపుకోవాల్సిన బాలుడు మృతి చెందడంతో  తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. 

ఆగష్టు 1వ తేదీన బాలుడి పుట్టిన రోజు. ఈ వేడుకల కోసం కుటుంబసభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.కరోనా కారణంగా స్కూల్స్ నడపడం లేదు. దీంతో ఇంటి వద్దే మిద్దెపై ఆడుకొంటున్నా బాలుడు ప్రమాదవశాత్తు నటి సంపులో పడిపోయాడు. అయితే ఈ విషయాన్ని సకాలంలో గుర్తిస్తే చిన్నారి ప్రాణాలు దక్కేవని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆడుకొంటున్న పిల్లాడి కోసం వెతికితే నీటి సంపులో బాలుడు కన్పించాడు.సంపు నుండి బాలుడిని తీసిన తర్వాత చూస్తే అతను అప్పటికే మరణించాడు
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu