ఏపీలో నిలకడగా కరోనా: కొత్తగా 3,797 కేసులు.. ప్రకాశంలో అత్యధిక మరణాలు

Siva Kodati |  
Published : Jun 30, 2021, 06:31 PM IST
ఏపీలో నిలకడగా కరోనా:  కొత్తగా 3,797 కేసులు.. ప్రకాశంలో అత్యధిక మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల నిలకడగా వుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,797 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,86,618కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల నిలకడగా వుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,797 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,86,618కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,706కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, ప్రకాశం 8,  తూర్పుగోదావరి 4, నెల్లూరు 1, విశాఖపట్నం 1, చిత్తూరు 7, గుంటూరు 1, కర్నూలు 2, కృష్ణ 2, విజయనగరం 3, శ్రీకాకుళం 3, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 5,498 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,35,574కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 97,696 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,19,93,618కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 38,338 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 165, చిత్తూరు 488, తూర్పుగోదావరి 874, గుంటూరు 306, కడప 230, కృష్ణ 182, కర్నూలు 117, నెల్లూరు 221, ప్రకాశం 350, శ్రీకాకుళం 110, విశాఖపట్నం 156, విజయనగరం 105, పశ్చిమ గోదావరిలలో 493 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu