ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణకు కళ్లెం పడడం లేదు. తాజాగా గత 24 గంటల్లో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో మూడు మరణాలు సంభవించాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అంతు లేకుండా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారి వల్ల ఏపీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకినవారిలో 43 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. 19 కేసులు చెన్నై కోయంబేడు లింకులున్న కేసులు కావడం గమనార్హం.
తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3377కు చేరుకున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 71కి చేరుకుంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక్కరేసి కోవిడ్-19తో మరణించారు.
undefined
రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2273 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో 9,986 శాంపిల్స్ ను పరీక్షించగా 98 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 29 మంది డిశ్చార్జీ అయ్యారు.
విదేశాల నుంచ్ి వచ్చినవారిలో 119 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది వారిలో ఈ రోజు ముగ్గురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 115 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వారిలో 616 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఈ రోజు 33 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 372 ఉన్నాయి.
: as on 04/06/2020
Total positive cases: 3377
Discharged: 2273
Deceased: 71
Active cases: 1033 pic.twitter.com/Oi0iova1G8